Advertisement

  • భారత సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం...థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలి: MAI

భారత సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం...థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలి: MAI

By: chandrasekar Wed, 23 Sept 2020 1:43 PM

భారత సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం...థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలి: MAI


కరోనావైరస్ భారతదేశ సినిమా ప్రపంచ౦ ఫై విపత్తులా విజృంభించింది. లక్షలాది మంది జీవితాలను కష్టాల పాలు చేసింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినిమా పరిశ్రమపై కరోనా వైరస్ ఒక గ్రహణంలా పట్టుకుంది. వివిధ చిత్ర పరిశ్రమలకు గత ఆరునెలల్లోనే సుమారు 9,000 కోట్లు నష్టం కలిగినట్టు సమాచారం. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఆరునెలల నుంచి కరోనావైరస్ వల్ల సినిమా పరిశ్రమకు వేలాది కోట్ల నష్టం కలిగింది. సినీ పరిశ్రమమై ఆధారపడే వాళ్లు నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితిని గమినించి మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం ముందు థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసింది.

మల్టిప్లెక్స్ ఆసోసియేషన్ ఆప్ ఇండియా ఇటీవలే ఒక ట్వీట్ చేసి మాల్స్, ఎయిర్ లైన్స్, రైల్వే, రెస్టారెంట్స్, జిమ్ ఇతర సెక్టార్స్ ను అన్ లాక్ ఇండియాలో భాగంగా మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశం కల్పించారు. అలాగే సినిమా థియేటర్లను మళ్లీ ప్రారంభించేందుకు మళ్లీ అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాము అని ట్వీట్ చేశారు. ఇలా చేయడం వల్ల సుమారు రెండు లక్షల మంది జీవితాలు మళ్లీ గాడినపడతాయి అని అంటున్నారు. భారత దేశంలో కరోనావైరస్ సంక్రమణను అదుపు చేయడానికి భారత్ ప్రభుత్వం మార్చిలో లాక్ డౌన్ విధించింది. అయితే ప్రస్తుతం అన్ లాకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అన్ లాక్ 4లో భాగంగా ఎన్నో మినహాయింపులు ఇచ్చారు. అయితే థియేటర్లు మళ్లీ తెరవాలి అని లేదంటే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది.

Tags :

Advertisement