Advertisement

స్కూల్స్ ఓపెన్..9 వేల మందికి పైగా కరోనా

By: Anji Fri, 28 Aug 2020 06:44 AM

స్కూల్స్ ఓపెన్..9 వేల మందికి పైగా కరోనా

ఈ కరోనా మహమ్మారి ముఖ్యంగా విద్యా వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో విద్యాసంస్థలన్నీ కరోనా కారణంగా మూసేసారు. ఇప్పటికే ఐదు నెలలు దాటిపోయింది. దీనితో కరోనాను ఎదుర్కొంటు స్కూల్స్ తిరిగి తెరవాలని చాలా దేశాలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంట్లో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ర్టంలో స్కూల్స్ రీ ఓపెన్ చేశారు. విద్యార్ధులు కూడా చాలా రోజుల తరువాత స్కూల్స్ ఓపెన్ చేయడంతో హ్యాపీగా వస్తున్నారు.


అయితే గత రెండు వారాలుగా కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారే ఏకంగా 9 వేల మందికి పైగా పిల్లలు కరోనా మహమ్మారి భారిన పడ్డారు. కరోనాకి సరైన వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనా కంట్రోల్ లోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు.


ఫ్లోరిడా రాష్ట్రంలో ఆగస్టు 24, 2020 వరకు 17, 18 ఏళ్లలోపు పిల్లల్లలో కరోనా కేసులు 39,900 ఉండేవి. అయితే ఒక్కసారి స్కూల్స్ రీఓపెన్ చేసిన తరువాత వాటి సంఖ్య ఏకంగా 49 వేలకు చేరింది. అంటే 9వేల 100ల కేసులు పెరిగాయి. అంటే దాదాపు 10వేల మంది పిల్లలు కరోనా భారిన పడ్డారు. ఈ మొత్తం కేసుల్లో ఫ్లోరిడా డి పార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఇటీవల విడుదల చేసిన పీడియాట్రిక్ నివేదిక ప్రకారం..37 శాతం కేసులు 13 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల్లోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


కరోనా తో హాస్పిటల్స్ లో చేరుతున్న సంఖ్య కూడా పెరుగుతోందని 655మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మనదేశంలో స్కూళ్లను ఇప్పుడు తెరిచే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. అన్ లాక్ 4.0 లో భాగంగా స్కూళ్లను థియేటర్లను మెట్రో రైళ్లను తిరిగి ప్రారంభిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.త్వరలోనే ఆన్ లాక్ 4 కి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. లాక్ డౌన్ వల్ల..తీసుకునే జాగ్రత్తల వల్లా చాలా దేశాల్లో కరోనా కొంచెం అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ భారత్ అమెరికా వంటి మరికొన్ని దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.


అమెరికాలో కేసులు కొన్ని రాష్రాల్లో కేసులు తగ్గుతున్నా .. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కరోనా ప్రభావం తగ్గలేదు. ఈ లోపే స్కూల్స్ రీఓపెన్ చేయటంతో ఫ్లోరిడాలో మహమ్మారి వ్యాప్తి పెరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ లో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్ చేయాలనే ప్రతిపాదలను కూడా వస్తున్నాయి. కానీ ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటంలేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో కేంద్రం త్వరలోనే అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేయబోతుంది. చూడాలి మరి మనదేశంలో స్కూల్స్ విషయంలో మోడీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటారో ..అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు. మరికొందరు ఆన్లైన్ క్లాసుల వైపు మొగ్గుచూపుతున్నారు.

Tags :

Advertisement