Advertisement

  • దినపత్రికలను ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తూ చదివేస్తోన్న 90 ఏళ్ల బామ్మ

దినపత్రికలను ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తూ చదివేస్తోన్న 90 ఏళ్ల బామ్మ

By: chandrasekar Wed, 30 Sept 2020 7:08 PM

దినపత్రికలను ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తూ చదివేస్తోన్న 90 ఏళ్ల బామ్మ


కరోనా వైరస్‌ వ్యాపిస్తుందనే అనుమానంతో వార్తాపత్రికలను మానేశారు. ఆన్‌లైన్‌లో వార్తలు చదువుతున్నారు. యువకులు, మధ్యవయస్సు వారికి ఈ టెక్నాలజీ తెలుసు. మరి 60 ఏళ్ల పైబడినవారి పరిస్థితి? కాని ఓ 90 ఏళ్ల బామ్మ వార్తలు చదువడం మానలేదు. న్యూస్‌ కోసం ల్యాప్‌టాప్‌ ఆపరేటింగ్‌ నేర్చుకునేసి ఇప్పుడు ఎంచక్కా ల్యాప్‌టాప్‌ ఆన్‌చేసి, వివిధ దినపత్రికలను ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తూ చదివేస్తోంది.

ల్యాప్‌టాప్‌లో వార్తలు చదువుతున్న తన అమ్మమ్మ మేరీ మాథ్యూ ఫొటోలను ఆమె మనువడు అరుణ్ థామస్ రెడ్డిట్‌లో పెట్టాడు. ‘నా అమ్మమ్మ ఈమెకు 90 ఏళ్ల వయస్సు. ఈ-వార్తాపత్రిక చదివేందుకు ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తున్నది. మార్పును అంగీకరించడం, స్వీకరించడానికి ఆమె ముందుకురావడం ప్రశంసనీయం.’ అని శీర్షిక పెట్టాడు.

ఆమె ప్రతిరోజూ దినచర్య వార్తాపత్రికల చదవడంతో ప్రారంభమవుతుంది..ఆ వారంలో మరణించిన వ్యక్తుల గురించి తెలుసుకుంటుంది.’ అని థామస్‌ కామెంట్‌లో రాశాడు. టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు మాథ్యూ చూపుతున్న ఉత్సాహాన్ని చూసి, నెటిజన్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పలువురు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.

Tags :

Advertisement