Advertisement

  • ముందస్తు అనుమతి తీసుకోమని 9 ఫార్మా కంపెనీలు నిర్ణయ౦...ట్రంప్ కు షాక్...

ముందస్తు అనుమతి తీసుకోమని 9 ఫార్మా కంపెనీలు నిర్ణయ౦...ట్రంప్ కు షాక్...

By: chandrasekar Thu, 10 Sept 2020 2:52 PM

ముందస్తు అనుమతి తీసుకోమని 9 ఫార్మా కంపెనీలు నిర్ణయ౦...ట్రంప్ కు షాక్...


టీకాను పరిశీలించకుండా ముందస్తు అనుమతి తీసుకోమని ఏకంగా 9 ఫార్మా కంపెనీలు నిర్ణయించుకున్నాయి. నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఎన్నికల్లో ప్రయోజనం కోసం అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా 9 ఫార్మా కంపెనీలు సేఫ్టీ ప్లెడ్జ్ అంటే భద్రత ప్రతిజ్ఞపై సంతకం చేశాయి. ఈ 9 కంపెనీల్లో ఆస్ట్రాజెనెకా, బయోన్టెక్, గ్లాక్సో స్మిత్ క్లైన్ పీఎల్ సీ, జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్, మోడెర్నా, నోవానాక్స్, ఫైజర్, సనోఫీ ఫార్మాలున్నాయి. సేఫ్టీ ప్లెడ్జ్ అంటే టీకాలు, ప్రజల భద్రత, శ్రేయస్సును పరిగణలో తీసుకోవడమే.

టీకాను పరిశీలించకుండా ముందుస్తు అనుమతి తీసుకోమని 9 కంపెనీలు నిర్ణయించుకుని సంతకాలు చేశాయి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత టీకా భద్రత, సమర్ధతను ప్రదర్శించిన తరువాతే వీటి ఉత్పత్తికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటామనేది సేఫ్టీ ప్లెడ్జ్‌ సారాంశంగా ఉంది. అంటే అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్ ఆశలకు నీరుగారినట్టే. ఎందుకంటే ఈ మహమ్మారి పై పోరాడటానికి చికిత్స, వ్యాక్సిన్ కోసం డోనాల్డ్ ట్రంప్ త్వరితగతిన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే అక్టోబర్‌లోనే కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా ఆమోదించవచ్చని ట్రంప్ అనుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ 9 ఫార్మా కంపెనీలు తీసుకున్న నిర్ణయం ట్రంప్ కు షాకే.



Tags :
|

Advertisement