Advertisement

తెలంగాణ రాష్ట్రంలో 894 కొత్త కరోనా కేసులు

By: chandrasekar Mon, 17 Aug 2020 11:08 PM

తెలంగాణ రాష్ట్రంలో 894 కొత్త కరోనా కేసులు


తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. ఇవాళ 2,006 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 21,420 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో 14,404 మంది ఉన్నారు. ఆదివారం 8794 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,53,349 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.

ఆదివారం జీహెచ్ ఎంసీ పరిధిలో 147, రంగారెడ్డి జిల్లాలో 85, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 9, ఖమ్మంలో 44, వరంగల్ అర్బన్ జిల్లాలో 44, వరంగల్ గ్రామీణ జిల్లాలో 9 చొప్పున, ఆదివాలాబాద్ జిల్లాలో 10, జగిత్యాల జిల్లాలో 31, నల్గొండ జిల్లాల్లో 37, జనగామా జిల్లాలో 7, కామారెడ్డి జిల్లాల్లో 7, జోగుళాంబా గద్వాల జిల్లాలో 21, సిద్దిపేట జిల్లాల్లో 58, సిరిసిల్ల జిల్లాల్లో 2, గద్వాల జిల్లాల్లో 21, పెద్దపల్లి జిల్లాల్లో 62 , సూర్యాపేట జిల్లాల్లో 12, నిజామాబాద్ 38, మహబూబాబాద్ జిల్లాల్లో 31 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags :
|
|

Advertisement