Advertisement

  • తెలంగాణలో వెయ్యికి చేరువవుతున్న ఒక్కరోజు కరోనా కేసులు ..నిన్న ఒక్కరోజే 872 కేసులు

తెలంగాణలో వెయ్యికి చేరువవుతున్న ఒక్కరోజు కరోనా కేసులు ..నిన్న ఒక్కరోజే 872 కేసులు

By: Sankar Tue, 23 June 2020 10:38 AM

తెలంగాణలో వెయ్యికి చేరువవుతున్న ఒక్కరోజు కరోనా కేసులు ..నిన్న ఒక్కరోజే 872  కేసులు



తెలంగాణాలో కరోనా ఉదృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది ..గత వారంరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి ..ఏరోజుకు ఆ రోజు అంతకుముందు ఉన్న రోజు కేసులను దాటుకుంటూ రోజు ఒక కొత్త రికార్డు నమోదు చేసుకుంటూ కరోనా దూసుకుపోతుంది..లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజల్లో ఏ మాత్రం కరోనా తాలూకూ భయం గాని , ఆందోళన గాని లేదు ..ఎప్పటిలానే రోడ్లపైన అవసరం ఉన్న లేకున్నా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు ..టెస్టుల సంఖ్య పెరుగుతుండటం కూడా కరోనా కేసులు పెరగడానికి ఒక కారణం ..అయితే ఈ పరిస్థితి ఇలానే ఉంటె హైదరాబాద్ కూడా ముంబై , ఢిల్లీలను చేరడానికి ఎక్కువ సమయం పట్టదు.

సోమవారం ఒక్క రోజు రాష్ట్రంలో 872 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,674కు ఎగబాకింది. కరోనాతో రాష్ట్రంలో మరో ఏడుగురు మరణించారు. దీంతో కొవిడ్-19 మరణాల సంఖ్య 217కు చేరుకుంది. సోమవారం మొత్తం 3189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదివారం 730 కేసులు నమోదైన విషయం తెలిసిందే.

గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌లో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో 12, మంచిర్యాలతో 5, వరంగల్ రూరల్ జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డిలో 3, మెదక్ జిల్లాలో 3, జనగాంలో 2, కరీంనగర్‌లో 2, మహబూబాబాద్‌లో 2 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్‌లో కొత్తగా మరో కేసు నమోదైంది.


Tags :
|
|
|

Advertisement