Advertisement

  • కేవలం ఆ రాష్ట్రాలలోనే 86 శాతం కరోనా మరణాలు సంభవిస్తున్నాయి..కేంద్ర ఆరోగ్య శాఖ

కేవలం ఆ రాష్ట్రాలలోనే 86 శాతం కరోనా మరణాలు సంభవిస్తున్నాయి..కేంద్ర ఆరోగ్య శాఖ

By: Sankar Mon, 21 Sept 2020 3:23 PM

కేవలం ఆ రాష్ట్రాలలోనే 86 శాతం కరోనా మరణాలు సంభవిస్తున్నాయి..కేంద్ర ఆరోగ్య శాఖ


దేశంలో కరోనా తీవ్రత విపరీతంగానే ఉంది..రోజుకు 80 వేలకు తగ్గకుండా కేసులు నమోదు అయితున్నాయి..అత్యధిక కరోనా కేసులో నమోదు అయ్యే దేశాలలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది..ఇక మొత్తం కేసులలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది..గ‌త ప‌దిహేను రోజులుగా ప్ర‌తిరోజు 80 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి.

మ‌ధ్య‌లో ఒక వారం రోజులైతే రోజూ 90 వేల‌కుపైగా మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి సోమ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 86,961 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అందులో కేవ‌లం 10 రాష్ట్రాల్లోనే 76 శాతం క‌రోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే అత్య‌ధికంగా 20 వేల మందికి క‌రోనా సోకింది. ఆ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎనిమిది వేల మంది క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

ఇక, గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా మొత్తం 1,130 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 86 శాతం మ‌ర‌ణాలు కేవ‌లం ప‌ది రాష్ట్రాల్లోనే న‌మోద‌య్యాయి. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 455 క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 101 మ‌ర‌ణాల‌తో క‌ర్ణాట‌క‌, 94 మ‌ర‌ణాల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమ‌వారం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

Tags :
|
|
|

Advertisement