Advertisement

85 ఏళ్ల బామ్మ...30 సంవత్సరాల నుండి యోగ ఆసనాలు

By: chandrasekar Mon, 22 June 2020 2:30 PM

85 ఏళ్ల బామ్మ...30 సంవత్సరాల నుండి యోగ ఆసనాలు


నేడు అంతర్జాతీయ యోగాదినోత్సవం. ప్రస్తుత కాలంలో మానవజీవితం 50 ఏళ్లకే ఎటుకదలలేని పరిస్థితి. ఆ రోగం ఈ రోగం అంటూ ఏది తినలేక నానాఇబ్బందులు పడుతుంటారు. కానీ వాటన్నింటిని తలదన్నుతూ పెద్దపల్లికి చెందిన 85 ఏళ్ల బామ్మ మాత్రం ఉత్సాహంగా జీవిస్తోంది.

ఓదెల మండలం కొలనూర్ కు చెందిన జిగురు కనకలక్ష్మి అనే బామ్మ ఆరోగ్యంగా ఉండాలని గత 30 సంవత్సరాల నుండి యోగ ఆసనాలు చేస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో తనకు తానుగానే యోగా నేర్చుకుంది. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి యోగాసనాలు వేస్తూ ఇప్పటికి తన పనులు తానే చేసుకుంటుంది.

కనకలక్ష్మి కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మ కుమారి మతం స్వీకరించింది. అప్పటినుండి ఆమె మాంసాహారాన్ని విడిచిపెట్టి, కేవలం కూరగాయలు మాత్రమే తింటుంది.ఆరోగ్యం కోసం పచ్చి కూరగాయలకు ఎక్కువగా తీసుకుంటుంది. జ్వరం, జలుబు లాంటివి వస్తే ఇంట్లో సహజ సిద్ధమైన చెట్ల నుండి వచ్చే రసాన్ని ఉపయోగించే వాటిని తగ్గించుకుంటుంది. ఇలా 85 ఏళ్ల వయసులో కూడా ఇవన్నీ పాటిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది.

Tags :
|
|

Advertisement