Advertisement

  • పుణె జంబో కరోనా సెంటర్‌ నుంచి 80 మంది హెల్త్‌కేర్‌ సిబ్బంది రాజీనామా

పుణె జంబో కరోనా సెంటర్‌ నుంచి 80 మంది హెల్త్‌కేర్‌ సిబ్బంది రాజీనామా

By: chandrasekar Wed, 09 Sept 2020 2:10 PM

పుణె జంబో కరోనా సెంటర్‌ నుంచి 80 మంది హెల్త్‌కేర్‌ సిబ్బంది రాజీనామా


కరోనా మహమ్మారి కారణంగా రోగులకు వైద్య సేవలు అంది౦చడం కోసం వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర ఆరోగ్య కార్యకర్తలు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు.

అలాగే, రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు చాలా మంది వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారు. అయితే .. పుణెలోని జంబో కరోనా‌ కేర్‌ సెంటర్‌లో గడిచిన రెండు వారాల్లో 80 మంది హెల్త్‌కేర్‌ సిబ్బంది రాజీనామా చేయడం ఈ తాజా ఘటన వారికి సరైన గౌరవం దక్కడం లేదని సూచిస్తోంది. వారికి అందుతున్న సౌకర్యాలపై వారు సంతోషంగా లేరని తెలుస్తోంది.

పుణే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఉన్న పుణె జంబో కొవిడ్ సెంటర్‌ నుంచి 80 మంది హెల్త్‌కేర్‌ సిబ్బంది రాజీనామా చేశారు. అందులో సగం మంది డాక్టర్లున్నారు. ఈ కేంద్రం ఆగస్టు 25న ప్రారంభమైంది.

ఇందులో 300 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కాగా, చాలామంది తమ బాధ్యతలనుంచి తప్పుకోవడంతో వీరి బాధ్యత కేవలం 35 శాతం సిబ్బంది భుజాలపై పడింది. ఇదిలా ఉండగా, హెల్త్‌కేర్‌ సిబ్బంది రాజీనామాకు మీరే కారణమంటూ వీరిని నియమించిన ఏజెన్సీ, పుణె నగరపాలిక అధికారులు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకోవడం గమనించాల్సిన విషయం.

Tags :

Advertisement