Advertisement

  • వికారాబాద్ జిల్లాలో విషాదం ..వాగు ఉధృతికి కొట్టుకుపోయి మహిళ మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం ..వాగు ఉధృతికి కొట్టుకుపోయి మహిళ మృతి

By: Sankar Thu, 17 Sept 2020 4:12 PM

వికారాబాద్ జిల్లాలో విషాదం ..వాగు ఉధృతికి కొట్టుకుపోయి మహిళ మృతి


తెలంగాణాలో గత నాలుగు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి..ఈ వర్షాల దాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి దీనితో ఎక్కడ ఏ ఆపద ఉందొ తెలియక ప్రజలు భయం తో హడలిపోతున్నారు..తాజాగా వికారాబాద్‌ జిల్లాలోని షాపూర్ తండాలో విషాదం చోటు చేసుకుంది. మర్పల్లి మండలం షాపూర్ తండాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు ఒకరిని బలిగొంది.

గ్రామం సమీపంలో ఉన్న వాగులో ఎనిమిది మంది చిక్కుకోగా స్థానికులు ఎన్నో కష్టాలు పడి ఏడుగురిని రక్షించారు. ఒకరు మాత్రం చనిపోయారు. గ్రామంలో నివాసం ఉండే దశరథ్ తన కుటుంబ సభ్యులు 8 మందితో కలిసి ఉదయం పొలానికి వెళ్లాడు. పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరుగుముఖం పట్టేలోపే భారీ వర్షం కురిసింది.

దీంతో అప్పటికప్పుడే సమీపంలోని వాగు ఉగ్రరూపంతో ప్రవహించడం మొదలైంది. దశరథ్ కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో 8 వ్యక్తులు వాగులో కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి తాళ్ల సాయంతో ఆరుగురు పిల్లలను కాపాడారు. దశరథ నాయక్ తన భార్యను కాపాడుకున్నాడు. కానీ, ఆమె అప్పటికే చనిపోయింది. స్థానికులు ప్రాణాలకు తెగించి వారిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Tags :
|
|
|

Advertisement