Advertisement

  • హైదరాబాద్ లో కరోనా హై రిస్క్ జోన్ల గుర్తింపు ..

హైదరాబాద్ లో కరోనా హై రిస్క్ జోన్ల గుర్తింపు ..

By: Sankar Mon, 13 July 2020 3:12 PM

హైదరాబాద్ లో కరోనా హై రిస్క్ జోన్ల గుర్తింపు ..



తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రాజధాని పరిసర జిల్లాల్లో కోవిడ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనే ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో ఓ దశలో రోజుకు 1400కిపైగా కరోనా కేసులు నమోదు కావడంతో జనం ఆందోళన చెందారు.

లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనే కరోనా ప్రభావం ఉండగా.. అన్‌లాక్ దశ ప్రారంభం కావడంతో.. నగరంలోని అన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 34,671 మంది కరోనా బారిన పడగా, అందులో 26,574 మంది గ్రేటర్ పరిధిలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

యూసుఫ్గూడ, అంబర్పేట్, మెహదీపట్నం, కార్వాన్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ సర్కిళ్లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వీటిని హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో... ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోవిడ్ బాధితులు ఇష్టానుసారం రోడ్ల మీదకు వస్తున్నారని ఆరోపణలు వస్తుండటం.. కరోనా కట్టడికి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర బృందం సూచించడంతో ఈ తిరిగి హైదరాబాద్ నగరంలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు కానున్నాయి.

Tags :
|
|

Advertisement