Advertisement

  • దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు ..కానీ రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా మరణాలు..

దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు ..కానీ రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా మరణాలు..

By: Sankar Tue, 08 Sept 2020 10:40 AM

దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు ..కానీ రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా మరణాలు..


భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది... ఆగస్టులోనే కేసుల సంఖ్య భారీగా పెరగగా... ఇక, సెప్టెంబర్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి... ఏకంగా 80 వేల మార్క్‌ను దాటి.. 90 వేలకు చేరువయ్యాయి రోజువారీ కేసులు..

అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. తాజాగా.. మరణాలు మరింత పెరిగి ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌ల 75,809 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి... ఇదే సమయంలో.. రికార్డు సంఖ్యలో 1,133 మంది మృతిచెందారు. దీంతో... దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 42,80,423కు చేరుకోగా... ఇప్పటి వరకు 72,775 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,83,697 యాక్టివ్ కేసులు ఉండగా... కరోనాబారినపడి ఇప్పటి వరకు 33,23,951 మంది కోలుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. మరోవైపు... సోమవారం రోజు దేశ్యాప్తంగా 10,98,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది... దీంతో... ఇప్పటి వరకు చేసిన టెస్ట్‌ల సంఖ్య 5,06,50,128కు పెరిగినట్టు పేర్కొంది.

Tags :
|
|

Advertisement