Advertisement

  • 740 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ సురక్షితమన్న చెన్నై కస్టమ్స్ శాఖ

740 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ సురక్షితమన్న చెన్నై కస్టమ్స్ శాఖ

By: chandrasekar Fri, 07 Aug 2020 3:56 PM

740 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ సురక్షితమన్న చెన్నై కస్టమ్స్ శాఖ


లెబనాన్ రాజధాని బీరూట్ ఓడరేవులో నిల్వచేసిన అమ్మోనియం నైట్రేట్ పేలుడుకు గురికావడంతో సురక్షితంగా లేని ప్రాంతాల్లో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో ఉదంతంతో తెలిసింది. ఇప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నాచెన్నైలో అలా జరగవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానీ దీనిగురించి కస్టమ్స్ శాఖ ఏమంటోంది వివరాలు చూస్తాం.

పేలుడు సంభవంలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా ఆస్తులకు కూడా చాలా నష్టం వాటిల్లింది. లెబనాన్ రాజధాని బీరూట్ ఓడరేవులో నిల్వచేసిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు సృష్టించిన విధ్వసం ఇంకా ఎవ్వరు మర్చిపోలేదు. 135 మంది మృతి చెందగా పలు ఇళ్లు, వీధులు ద్వాంసమయ్యాయి. వేలాదిమందికి గాయాలయ్యాయి. ఇప్పుడు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోతే చెన్నై కూడా మరో బీరూట్ కానుందనే వార్తలు ఎక్కువవుతున్నాయి. బాణాసంచా, ఎరువుల తయారీలో ఉపయోగించే పేలుడు పదార్ధమైన అమ్మోనియం నైట్రేట్ ను 2015లో చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ప్రదేశంలో 36 కంటెయినర్లుండగా ఒక్కో కంటెయినర్ లో 20 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉంది. మొత్తం 740 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉంది. నిన్నటివరకూ ఈ వ్యవహారం కోర్టులో ఉండటం వల్ల ఏళ్ల తరబడి ఇలాగే చెన్నై సమీపంలోని మనలీలో ఉండిపోయింది. బీరూట్ ఘటన నేపధ్యంలో ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానికులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

చెన్నైలో నిల్వవుంచబడ్డ అమ్మోనియం నైట్రేట్ కారణంగా స్థానికుల ఆందోళన, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేఫధ్యంలో కస్టమ్స్ శాఖ స్పందించింది. చెన్నై నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనలీలో ఈ అమ్మోనియం నైట్రేట్ నిల్వలు సేఫ్ కస్టడీలో ఉన్నాయని కస్టమ్స్ శాఖ ప్రకటించింది. ఈ నిల్వలున్న ప్రాంతానికి 2 కిలోమీటర్ల వరకూ నివాస ప్రాంతాలు లేవని అన్నిజాగ్రత్తలు తీసుకున్నామని కస్టమ్స్ శాఖ వెల్లడించింది. దీనివల్ల ప్రజలెవ్వరూ భయాందోళనకు గురికావలసిన అవసరం లేదన్నారు.

Tags :

Advertisement