Advertisement

  • చెన్నై ఐఐటిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

చెన్నై ఐఐటిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Mon, 14 Dec 2020 12:10 PM

చెన్నై ఐఐటిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు


దేశంలో కరోనా వ్యాప్తి కొంచెం తగ్గినట్లే అనిపిస్తుంది...కేసులు కూడా రోజు తక్కువగానే నమోదు అయితున్నాయి..అయితే చెన్నై ఐఐటి లో మాత్రం ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల కలకలం రేపింది..

తాజాగా 71 మందికి కరోనా బారినపడ్డారు. ఇందులో 66 మంది విద్యార్థులున్నారని ఐఐటీ అధికారులు తెలిపారు. ఎక్కడ నుంచి విస్తరించిందోతెలియదుగానీ, కేవలం ఒక్కరోజులోనే 32 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని క్యాంపస్ అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున క్యాంపస్‌లోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం ఇనిస్టిట్యూట్‌కు సూచించింది.

యూనివర్సిటీలో 774 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో మళ్లీ లాక్‌డౌన్ నిబంధనలను అమలులోకి తెచ్చామని, అన్ని డిపార్టుమెంట్లను మూసివేస్తున్నట్లు తెలిపారు.

Tags :
|

Advertisement