Advertisement

  • ఇండియాలో కేవలం ఆ అయిదు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా మరణాలు నమోదు అయితున్నాయి

ఇండియాలో కేవలం ఆ అయిదు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా మరణాలు నమోదు అయితున్నాయి

By: Sankar Thu, 03 Sept 2020 5:18 PM

ఇండియాలో కేవలం ఆ అయిదు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా మరణాలు నమోదు అయితున్నాయి


ఇండియాలో కరోనా రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతూనే ఉంది..ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అంమోదు అయితున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉండగా , ఒక్కరోజు కేసుల్లో మాత్రం మొదటి స్థానం లో ఉంది..అయితే ఇండియాలో మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయి..అయితే నమోదు అయ్యే ఆ మరణాలుకూడా కేవలం కొన్ని రాష్ట్రాలలోని నమోదు అయితున్నాయి..

ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్ర అధికంగా ఉందంటోంది కేంద్రం. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 70 శాతం మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు. ఏపీ, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో అత్యధిక మరణాలు నమోదైనట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా 11 లక్షల 70 వేల శాంపిల్స్‌ను పరీక్షించగా 83 వేల 883 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి..

భారత్‌ లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కాలేదు. ఇక ఈరోజు నమోదయిన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 38లక్షల 53వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 29 లక్షల 70 వేల మందికి పైగా కోలుకోగా.. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్సపొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 68వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.1శాతానికి చేరింది.

Tags :
|
|
|
|

Advertisement