Advertisement

  • టర్కీని కుదిపేసిన బారి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0 ...

టర్కీని కుదిపేసిన బారి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0 ...

By: chandrasekar Sat, 31 Oct 2020 09:20 AM

టర్కీని కుదిపేసిన బారి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0 ...


ఎవరు ఊహించని విధంగా టర్కీలో బారి భూకంపం వచ్చింది. టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు అయింది అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. యూఎస్ జీఎస్ ప్రకారం సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. గ్రీస్ దేశంలోని నియోన్ కార్ల్ వోషన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో భూమి భారీగా కంపించింది. టర్కీలోని విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల విభాగం మాత్రం భూకంప తీవ్రతను 6.6గా తెలిపింది. అయితే అమెరికాలోని జియోలాజికల్ సర్వే మాత్రం 7.0గా చెబుతోంది.

భూకంపంవల్ల చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. స్థానికంగా 11.50 నిమిషాల సమయంలో టర్కీలోని ఎగెన్ తీరం వెంబడి మార్మారా ప్రాంతం వరకు భూమి కంపించింది అని టర్కీ మీడియా సంస్థలు తెలిపాయి. గ్రీస్ దేశానికి సమీపంలో ఉన్న సమోస్ అనే దీవిలో సుమారు 45వేల మంది ప్రజలు నివసిస్తుంటారు. వీరందరినీ తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండమని అక్కడి ప్రభుత్వం కోరింది. ఈ భూకంప తీవ్రతా చాలా ఎక్కువగా ఉందని ఇంత భారీ స్థాయిలో భూ ప్రకంపణలు రావడం సాధారణ విషయం కాదు అని ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యెర్లికయా తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసికోవాలని తెలిపారు.

Tags :
|

Advertisement