Advertisement

  • ఏపీలో ఊహించని విధముగా పెరుగుతున్న కరోనా కేసులు , ఒక్క రోజే 6,045 కొత్త కేసులు

ఏపీలో ఊహించని విధముగా పెరుగుతున్న కరోనా కేసులు , ఒక్క రోజే 6,045 కొత్త కేసులు

By: Sankar Wed, 22 July 2020 5:50 PM

ఏపీలో ఊహించని విధముగా పెరుగుతున్న కరోనా కేసులు , ఒక్క రోజే 6,045 కొత్త కేసులు



ఏపీలో కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి ..గత కొద్దీ రోజులుగా నమోదు అయినా కేసులు చూస్తుంటే ఏపీ ప్రజలు షాక్కు గురి అవుతున్నారు ..ఇప్పటిదాకా దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న మహారాష్ట్ర , తమిళనాడు స్థాయిలో నమోదు అవుతున్నాయి ..తాజాగా ఒక్కరోజే 6,045 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి..దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,713కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుద చేసింది..

గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిల్స్‌ పరీక్షించగా 6,045 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. కొత్తగా కరోనాతో కోలుకున్న 6,494 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 32,127కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,763 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనాతో 65 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 823గా నమోదైంది. మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 14,35,827 శాంపిల్స్‌ను పరీక్షించారు.

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే విశాఖపట్నంలో అత్యధికంగా 1049 కేసులు నమోదు అయ్యాయి ..ఆ తర్వాత ఈస్ట్ గోదావరి , గుంటూరు లలో 800 లకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..ఆ తర్వాత కర్నూల్ , వెస్ట్ గోదావరీలలో ఆరు వందలకు పైగా కేసులు వచ్చాయి ..


Tags :
|
|
|
|
|

Advertisement