Advertisement

వివాహిత ఫేస్ బుక్ స్నేహం ..చివరకు కూతురు బలి

By: Sankar Fri, 03 July 2020 10:41 AM

వివాహిత ఫేస్ బుక్ స్నేహం ..చివరకు కూతురు బలి



సామజిక మాధ్యమాలలో స్నేహాలు ఒక్కోసారి ఎటువంటి తీవ్ర పరిస్థితులకు దారి తీస్తాయో చెప్పడానికి నిన్న హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ దగ్గర పోచారంలో జరిగిన చిన్నారి హత్యా మంచి ఉదాహరణ ..తన తల్లి చేసిన తప్పుకు ఎటువంటి అభంశుభం తెలియని చిన్నారి బలయింది ..పెళ్లి అయింది , మంచి భర్త , ముద్దులొలికే కూతురు ఇవేమి ఆమెను తప్పటడుగు వేయకుండా ఆపలేకపోయాయి ..ఫేస్బుక్ స్నేహం పేరుతో ఇద్దరు యువకులతో సాన్నిహిత్యం పెంచుకున్న మహిళా చివరకు తన కూతురును కోల్పోయింది ..ఇంత జరుగుతున్నప్పటికీ తన భర్తకు ఏమి తెలియకపోవడం షాక్ కు గురిచేస్తుంది ..

భువనగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 2011లో ఆంధ్రప్రదేశ్‌ అనంతపురానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల పాప ఆద్య ఉంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ప్రేమ వివిహం చేసుకున్నట్లు తెలుస్తోంది. భర్త భువనగిరిలో రెవెన్యూ శాఖలో కీలక విధులు నిర్వహిస్తున్నారు. ఘట్‌కేసర్‌ సమీపంలోని పోచారంలో విహారీ హోమ్స్‌లో వీరు నివాసం ఉంటున్నారు.

ఆ మహిళకు సికింద్రాబాద్‌లోని భవానీనగర్‌కు చెందిన కరుణాకర్ అనే యువకుడితో కొద్ది రోజుల కిందట ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. వారిద్దరూ పాత స్నేహితులే కావడంతో క్రమంగా సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత కరుణాకర్ ఆమెకు రాజశేఖర్‌‌ అనే మరో పాత స్నేహితుడిని పరిచయం చేశాడు. రాజశేఖర్ పరిచయమయ్యాక అతడితో సాన్నిహిత్యం పెంచుకున్న మహిళ.. కరుణాకర్‌ను దూరం పెట్టసాగింది. ఈ విషయం తెలుసుకున్న కరుణాకర్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మహిళ ఇంటికి వచ్చాడు.

రాజశేఖర్ ఆమెతో పాటు ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న కరుణాకర్ ..బయటకు రాకపోతే ఆమె కూతుర్ని చంపేస్తా అని భయపెట్టాడు ..అయినా కూడా బయటకు రాకపోవడంతో ఆమె కూతురుని దారుణంగా పొడిచేసాడు , అడ్డుకోబోయిన ఆమెను కూడా కత్తితో దాడి చేసాడు ..ఇది విని బయటకు వచ్చిన రాజశేఖర్ను పొడిచి , కరుణాకర్ తనను తాను గొంతు కోసుకున్నాడు ..చిన్నారి అక్కడిక్కడే మరణించగా వీరి ముగ్గురికి ఆసుపత్రిలో చికిస్థ అందిస్తున్నారు ..

అయితే కరుణాకర్, రాజశేఖర్, ఆ మహిళ.. వీరు ముగ్గురికీ గతంలోనే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషయం మహిళ భర్తకు తెలియదని వెల్లడించారు. మహిళతో కరుణాకర్ కొంత కాలంగా గొడవ పడుతున్నట్లు తెలిపారు..బంధువులు, స్థానికులను ప్రశ్నించి పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు.

Tags :
|
|

Advertisement