Advertisement

  • 11 పరీక్షలకు బదులు ఆరు ....కసరత్తు చేస్తున్న తెలంగాణ విద్యాశాఖ

11 పరీక్షలకు బదులు ఆరు ....కసరత్తు చేస్తున్న తెలంగాణ విద్యాశాఖ

By: Sankar Fri, 18 Dec 2020 11:21 AM

11 పరీక్షలకు బదులు ఆరు ....కసరత్తు చేస్తున్న తెలంగాణ విద్యాశాఖ


కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణాలో ఇంతవరకు విద్యాసంవత్సరం ప్రారంభం అవ్వలేదు ..ఆన్లైన్ లో క్లాస్ లు జరుగుతున్నప్పటికీ , పాఠశాలకు వెళ్ళిన దానికి , ఆన్లైన్ కు పోలిక ఉండదు ..ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ లో పాటలు విని బోర్డు పరీక్షలు రాయడం కష్టమైన విషయం ..అందుకే వారికోసం ఈ సారి 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విద్యా బోధన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఏప్రిల్‌/మేలో నిర్వహించే టెన్త్‌ పరీక్షల్లో ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదించింది.

ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ సబ్జెక్టుల్లో రెండు పేపర్ల చొప్పున ఉండగా హిందీ మాత్రం ఒకే పేపర్‌ ఉంది. ఇకపై సబ్జెక్టుకు ఒక పేపరే ప్రశ్నపత్రం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇక ఇంటర్‌ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించాలని యోచిస్తోంది.

Tags :

Advertisement