Advertisement

  • ప్రశాంతంగా ముగిసిన జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలు

By: Sankar Sat, 28 Nov 2020 7:59 PM

ప్రశాంతంగా ముగిసిన జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలు


జమ్మూకశ్మీర్​కు స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల తొలిదశ ఎన్నికలు శనివారం జరిగాయి.

ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలై మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి.

అనుమానాస్పద ప్రాంతాలలో బలగాలు గస్తీ నిర్వహించాయి. సురక్షితమైన ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉంచామని, మొత్తం 51.76% పోలింగ్‌ నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ తెలిపారు.

Tags :
|

Advertisement