Advertisement

  • మాస్క్ లేకుంటే జరిమానా ..అహ్మదాబాద్ కార్పొరేషన్ కఠిన నిబంధనలు

మాస్క్ లేకుంటే జరిమానా ..అహ్మదాబాద్ కార్పొరేషన్ కఠిన నిబంధనలు

By: Sankar Mon, 13 July 2020 8:39 PM

మాస్క్ లేకుంటే జరిమానా ..అహ్మదాబాద్ కార్పొరేషన్ కఠిన నిబంధనలు



కరోనా నిర్మునలకు అన్ని ప్రభుత్వాలు అనేక చర్యలను చేపడుతున్నాయి ..వాక్సిన్ లేకపోవడంతో అందరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందే ..అయితే చాలా మంది ఇప్పటికి కూడా ఇంకా వ్యక్తిగత శ్రద్ధ పాటించటడం లేదు ..బయటకు వెళ్లేప్పుడు ఇంకా మాస్క్ లు ధరించకుండానే తిరుగుతున్నారు ..దీనితో వివిధ రాష్ట్రాలు మాస్క్ లు లేకపోతే జరిమానాలు విధించే చర్యలను చేపడుతున్నాయి ..

అందులో భాగంగానే గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కరోనా నియంత్రణకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ప్రజలు భౌతికదూరం పాటించాలని, పబ్లిక్‌ ప్రాంతాల్లో విధిగా మాస్కులు ధరించాలని అవగాహన కల్పిస్తోంది. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తోంది. మాస్కులు ధరించకుండా పట్టుబడితే గతంలో రూ.200 జరిమానా ఉండగా తాజా ఆ మొత్తాన్ని రూ.500లకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలాఉండగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సైతం మాస్కులు ధరించని వారికి రూ. 500 జరిమానా విధించాలని ఈ నెల 10న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,280 కరోనా కేసులు నమోదుకాగా 29,162 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 10,613 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 2,045 మంది మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది.

Tags :
|
|
|

Advertisement