Advertisement

  • 50 ఏళ్ల వ్యక్తి తన 20ఏండ్ల మేనకోడలిపై లైంగిక వేధింపులు

50 ఏళ్ల వ్యక్తి తన 20ఏండ్ల మేనకోడలిపై లైంగిక వేధింపులు

By: chandrasekar Wed, 09 Sept 2020 2:13 PM

50 ఏళ్ల వ్యక్తి తన 20ఏండ్ల మేనకోడలిపై లైంగిక వేధింపులు


ఓ వ్యక్తి తన మేనకోడలి పైనే లైంగిక వేధింపులకు పాల్పడగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. 50 ఏళ్ల వ్యక్తి తన 20ఏండ్ల మేనకోడలిపై లైంగిక వేధింపులకు పాల్ప‌డుతుండడంతో .. సోమ‌వారం పేట్‌బ‌షీరాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన యువ‌తి లాక్‌డౌన్ అనంత‌రం ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చి త‌న మేన‌మామ ఇంట్లో నివాసం ఉంది.

ఆ స‌మ‌యంలో 50 ఏండ్ల మేన‌మామ ఆమెపై ప‌లుమార్లు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌గా విసుగు చెందిన యువ‌తి అక్క‌డి నుంచి వెళ్లి హాస్ట‌ల్‌ లో ఉంటోంది

ఆ త‌రువాత కూడా అత‌డి వికృత చేష్ట‌లు మానక పోవడంతో వాడి గురించి కుటుంబ స‌భ్యుల‌కు తెలిపి, పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిపై కేసు న‌మోదు చేసి సోమ‌వారం అరెస్టు చేసిన‌ట్లు వారు తెలిపారు.

Tags :

Advertisement