Advertisement

  • వ్యాక్సిన్ లో 50 శాతం ఇండియాకు కేటాయిస్తాము ...సీరం

వ్యాక్సిన్ లో 50 శాతం ఇండియాకు కేటాయిస్తాము ...సీరం

By: Sankar Tue, 29 Dec 2020 10:47 AM

వ్యాక్సిన్ లో 50 శాతం ఇండియాకు కేటాయిస్తాము ...సీరం


ఓవైపు ప్రపంచాన్ని కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ క్రమంగా ప్రారంభిస్తున్నాయి ఆయా దేశాలు.. భారత్‌లోనూ కోవిడ్ వ్యాక్సిన్‌ 'డ్రై రన్‌' సాగుతోంది.. ఈ సమయంలో.. కోవిడ్ వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసింది సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా...

కరోనాకు చెక్‌ పెట్టేందుకు ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పనిచేస్తోంది సీరం.. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా.. ఈ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. తాము ఉత్పత్తి చేసే ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్లలో సగం అంటే 50 శాతం.. భారత్‌, కోవ్యాక్స్‌లకే కేటాయిస్తామని సీరం సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు..

ఇక, 2021 జూలై నాటికి 30 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. యూకేలో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు జనవరి మొదటివారంలో అనుమతులు లభించవచ్చని, ఆ వెంటనే భారత్‌లోనూ గుడ్‌న్యూస్‌ వింటామనే ఆశాభావం వ్యక్తం చేశారు..కాగా ఇండియాలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు మొదలయ్యాయి ..తాజాగా ఇండియాలో ఆరు కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ కేసులు నమోదు అయ్యాయి..దీనితో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి..

Tags :
|
|

Advertisement