Advertisement

  • ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ సీనియర్ సిటిజన్లకు 50 శాతం తగ్గింపు...

ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ సీనియర్ సిటిజన్లకు 50 శాతం తగ్గింపు...

By: chandrasekar Thu, 17 Dec 2020 1:07 PM

ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ సీనియర్ సిటిజన్లకు 50 శాతం తగ్గింపు...


ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ 60 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి యాభై శాతం తగ్గింపును ఇవ్వనుంది. బుధవారం విమానయాన శాఖ ఈ పథకం గురించి వెల్లడించింది. పథకం పూర్తి వివరాలను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో వుంచారు. ప్రయాణించే వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండి 60 సంవత్సరాల పైన వయసు వారై ఉండాలి. చెక్-ఇన్ సమయంలో ఐడీ చూపనిపక్షంలో ప్రాథమిక ఛార్జీలు జప్తు చేస్తారు. ప్రయాణం రోజుకు కనీసం 7 రోజుల ముందు టికెట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర విమానయాన శాఖ పేర్కొన్నది.

ఇటువంటి పథకాన్ని ఎయిర్ ఇండియా ముందే అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం దీనిని ఇప్పుడు ఆమోదించింది. ఈ ఆఫర్ భారతదేశంలోని ఏ రంగానికైనా ప్రయాణానికి చెల్లుబాటవుతుంది. ఈ పథకం దేశీయ విమానాల కోసం మాత్రమే. చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ, ఐడీపై పుట్టిన తేదీ ఉండాలి. ఎకానమీ క్యాబిన్ బుకింగ్ క్యాటగిరీకి అసలు ఛార్జీలలో 50 శాతం చెల్లించాలి.

Tags :
|

Advertisement