Advertisement

ఆకతాయిల ఆటకట్టించిన మారేడుమిల్లి పోలీసులు

By: Dimple Tue, 25 Aug 2020 10:18 AM

ఆకతాయిల ఆటకట్టించిన మారేడుమిల్లి పోలీసులు

ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న మన్యం ప్రాంతం. మారేడుమిల్లి... ఈ మన్యాన్ని సందర్శించే పర్యాటకులకు ఓ దివ్యాను భూతి. అయితే కొందరు ఆకతాయిలు... ఆ పర్యాటక ప్రాంతాన్ని తమ అవసరాలకు పావుగా వినియోగిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలతో జూలాయిలు, ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మద్యం తాగుతూ వీరంగం సృష్టించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన కుర్రకారు అలజడులను సృష్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే మన్యం మారేడుమిల్లి లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసులకు కూడా ఆకతాయిలనుంచి చేదు అనుభవం ఎదురైంది. మారేడు మిల్లిలోని ది వుడెన్ రిసార్ట్స్ లోకి శనివారం రాత్రి10 గంటల ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించిన ఆకతాయిలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆగడాలు శృతి మించడంతో అడ్డుకున్న వాచ్ మెన్ ను కొట్టి క్యాంటీన్ లోకి ప్రవేశించి నానా రభస సృష్టించారు. ఆకతాయిలు ఆగడాలపై సమాచారం అందుకున్న ఎస్ ఐ డి రామకృష్ణ , సి ఐ ఏ ఎల్ ఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో తమ సిబ్బందిని ఏఎస్ఐ ఎస్.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ పల్లాల. ఆదినారాయణ ను సంఘటన స్థలానికి పంపించారు.

అక్కడ ఆకతాయిల ఆగడాలు అడ్డూ అదుపులేకుండా సాగుతున్నాయి. ఆకతాయిలను నివారించే ప్రయత్నంలో ఏఎస్ఐ వెంకటేశ్వేరరావు ను నెట్టివేసి , పోలీసులని అని చూడకుండా కానిస్టేబుల్‌ ఆదినారాయణ పై చేయిచేసుకున్నారు. దింతో ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ఆదినారాయణ పిర్యాదు చేసాడు. వెంటనే రంపచోడవరం ఏ ఎస్ పి బిందు మాధవ్ సంఘటన స్థలాన్ని సందర్శించి... ఐదు గురు నిందితులుగా పేర్కొన్న యువకులను అరెస్ట్ చేశారు. నిందితులు మండపేట ప్రాంతానికి చెందిన సుంకర.సాయి సతీష్ గుణ్ణం.మణికంఠ ,బెజవాడ. సంజయ్ , నల్లమిల్లి.హేమంత్ రెడ్డి , ఆలమూరు మండలం గుమ్నాలేరు ప్రాంతానికి చెందిన రెడ్డి.రవిశంకర్ లను గుర్తించారు. , అనే వీరిపై 448,353,332,323, రెడ్‌ విత్‌ 34 ఐపిసి సెక్షన్ కింద 3(1)ఎస్, 3(2)విఆర్, ఎస్ సి , ఎస్టీ ఫో యాక్ట్ కేసు నమోదు చేశామని అడిషన్‌ ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మన్యంలో కట్టు దట్టమైన భద్రత ను ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి ఎస్ ఐ డి రామకృష్ణ , సి ఐ ఏ ఎల్ ఎస్ రవికుమార్ గుర్తేడు ఎస్ ఐ. జి సతీష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :
|
|

Advertisement