Advertisement

వీరి అకౌంట్లలోకి కూడా నెలకు 5 వేల రూపాయలు...?

By: chandrasekar Wed, 09 Dec 2020 7:52 PM

వీరి అకౌంట్లలోకి కూడా నెలకు 5 వేల రూపాయలు...?


రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందిస్తోంది. ఈ డబ్బులు మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. రైతుల మాదిరిగానే మరి కొందరికీ కూడా నేరుగా డబ్బులు అందించాలనే ప్రతిపాదన ఒకటి ఉన్నట్లు సమాచారం. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సు చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. షెడ్యూల్డ్ క్యాస్ట్స్, ట్రైబ్స్‌కు నేరుగా డబ్బులు అందించాలనేది వీటి సారాంశం. నెలకు రూ.5,000 కన్నా తక్కువ ఆదాయం కలిగిన వారికి ఈ స్కీం ద్వారా నగదు పొందొచ్చు. నివేదిక ప్రకారం చూస్తే ఎస్సీ, ఎస్టీలకు అందించే స్కీమ్స్‌‌‌లో 40 శాతం మొత్తాన్ని ఇలా నేరుగా వారి అకౌంట్లలో వేస్తే ప్రయోజనం ఉంటుందని నీతి ఆయోగ్ పేర్కొంది.

అలాగే మిగతా 60 శాతం మొత్తాన్ని వీరు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు వినియోగించాలని తెలిపింది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే నీతి ఆయోగ్ నుంచి కానీ ఈ అంశంపై ఎలాంటి స్పందన రాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బలహీన వర్గాల కోసం కొంత మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులతో కొత్త స్కీమ్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీలకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బులు వేయనుంది. 2020-21 బడ్జెట్ కేటాయింపుల ప్రకారం చూస్తే ఒక్కో కుటుంబానికి నెలకు రూ.5 వేలు లభిస్తాయి. అదే రూ.10 వేల ఆదాయంలోపు అందిస్తే కుటుంబానికి నెలకు రూ.1,310 అందించొచ్చు. కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో SCSP, TSP కింద వరుసగా రూ.83,257 కోట్లు, రూ.53,653 కోట్లు కేటాయించింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం నెలకు రూ.5,000 కన్నా తక్కువ సంపాదించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు 92 లక్షల వరకు ఉండొచ్చు.

Tags :
|
|

Advertisement