Advertisement

సోషల్ నెట్ వర్క్ వాట్సప్ లో 5 కొత్త ఫీచర్లు

By: chandrasekar Fri, 03 July 2020 3:34 PM

సోషల్ నెట్ వర్క్ వాట్సప్ లో 5 కొత్త ఫీచర్లు


సోషల్ నెట్ వర్కింగ్ గా ప్రాచుర్యం పొందిన వాట్సప్ లో ఎట్టకేలకు 5 ఫీచర్లు రానున్నాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఈ ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్టు వాట్సప్ ప్రకటించింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ కొత్త ఫీచర్లు త్వరలో ప్రత్యక్షం కానున్నాయి. ఇవి కాకుండా మరో కొత్త ఫీచర్ త్వరలో రానుంది.

వాట్సప్ యూజర్ల కోసం కంపెనీ యాప్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న 5 ఫీచర్లను ప్రవేశపెడుతోంది సంస్థ. యానిమేటెడ్ స్టిక్కర్స్, క్యూఆర్ కోడ్స్, వెబ్ వాట్సప్ కు డార్క్ మోడ్, క్వాలిటీ వీడియో కాల్స్, కైవోఎస్ కు మాయమయ్యే స్టేటస్ ఈ ఐదు ఫీచర్లు రోజుల వ్యవధిలో మీ మొబైళ్లలో ప్రత్యక్షమవుతాయి.

కొన్ని రోజుల క్రితమే వాట్సప్ ఫీచర్ ట్రాకర్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. తమ యాప్ లో కొత్త ఫీచర్లపై పరిశీలన కొనసాగుతోందని మరీ ముఖ్యంగా మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ పై కూడా పరిశోధన సాగుతోందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులో రానుందనేది కంపెనీ సైతం చెప్పలేకపోతోంది.

కొత్తగా రానున్న 5 ఫీచర్లు


యానిమేటెడ్ స్టికర్స్( Animated Stickers ): వాట్సప్ ఎప్పుడూ సమర్ధవంతమైన ప్రొడక్ట్ నే అందిస్తుంటుంది. మీ చాటింగ్ ను మరింతగా ఆకర్షణీయంగా చేసేందుకు ఇప్పుడు యానిమేటెడ్ స్టిక్కర్లను తీసుకొస్తోంది. నచ్చిన స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు ఇక.

క్యూఆర్ కోడ్ ( QR Code ): ఈ ఫీచర్ ప్రకారం ఓ వ్యక్తిని వాట్సప్ లో చేర్చాలంటే వారి మొబైల్ నెంబర్ అవసరం లేదిక. క్యూ ఆర్ నెంబర్ ను స్కాన్ చేసి ఆ వ్యక్తిని వాట్సప్ లో యాడ్ చేసుకోవచ్చు.

వీడియో కాల్ క్వాలిటీ ( Video Call Quality ): ఇకపై వీడియో కాల్ క్వాలిటీ పెరగనుంది ఈ కొత్త ఫీచర్ తో. వాట్సప్ ఈ మధ్యనే గ్రూప్ వీడియో కాల్ లో పాల్గొనే వారి సంఖ్యను 4 నుంచి 8 కు పెంచింది. ఇప్పుడు ఈ వీడియో కాల్ క్వాలిటీను పెంచేందుకు ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. వీడియో కాల్ లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిపై ప్రెస్ చేస్తే ఫోకస్ పెరిగేలా మార్పులు చేర్పులు కన్పిస్తాయి.

వాట్సప్ వెబ్ కు డార్క్ మోడ్ ( Dark mode for web ): మీ వాట్సప్ ను కంప్యూటర్ స్క్రీన్ పై లేదా ల్యాప్ టాప్ పై ఓపెన్ చేయాలనుకుంటే వాట్సప్ వెబ్ ఓపెన్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఈ వెబ్ కు డార్క్ మోడ్ ఫీచర్ ను జత చేసింది. ఇప్పటివరకూ మొబైల్ వెర్షన్లకు మాత్రమే ఉన్న డార్క్ మోడ్ ను ఇక వెబ్ వెర్షన్ కు కూడా రానుంది.

కేవోఎస్ స్టేటస్ ( Kaios status ): కైవోఎస్ లో స్టేటస్ తనంతటదే మాయమయ్యే కొత్త ఫీచర్ ను వాట్సప్ అందుబాటులో తీసుకొస్తోంది. ఇప్పటివరకూ ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్, ఐవోఎస్ లకు మాత్రమే ఉంది. ఇప్పుడిక కైవోఎస్ కు కూడా వర్తించనుంది.

Tags :
|

Advertisement