Advertisement

ఏపీలో 24 గంటల్లో 43 మరణాలు

By: chandrasekar Tue, 14 July 2020 6:34 PM

ఏపీలో 24 గంటల్లో 43 మరణాలు


ఏపీని కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది.. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. మంగళవారం బులిటెన్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 22,670 శాంపిల్స్ పరీక్షించగా మరో 1908 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 8మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసులు 1916కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 15144కు చేరింది. గడచిన 24 గంటల్లో 43మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 408కి చేరింది. గత 24 గంటల్లో 952మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.

దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 17467 నమోదయ్యింది. మరో 15144మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 238, శ్రీకాకుళం జిల్లాలో 215, పశ్చిమగోదావరి జిల్లాలో 199, అనంతపురం జిల్లాలో 185, కర్నూలు జిల్లాలో 169, నెల్లూరు జిల్లాలో 165, తూర్పుగోదావరి జిల్లాలో 160, గుంటూరు జిల్లాలో 146, విజయనగరం జిల్లాలో 130, కృష్ణా జిల్లాలో 129, కడప జిల్లాలో 112, ప్రకాశం జిల్లాలో 32, విశాఖపట్నం జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 3823పాజిటివ్ కేసులు తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 3651కు చేరాయి. గుంటూరు జిల్లాలో 3356 కేసులు ఉన్నాయి.

Tags :
|
|

Advertisement