Advertisement

మహారాష్ట్ర లో 33వేల మంది పిల్లలకు కరోనా..

By: Sankar Tue, 08 Sept 2020 10:31 AM

మహారాష్ట్ర లో 33వేల మంది పిల్లలకు కరోనా..


దేశంలో అత్యధిక కరోనా కేసులు నమవుదు అయితున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది..దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 42 లక్షలు దాటగా ఒక్క మహారాష్ట్రలోనే 9 లక్షలు దాటడం గమనార్హం.దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 42 లక్షలు దాటగా ఒక్క మహారాష్ట్రలోనే 9 లక్షలు దాటడం గమనార్హం..

రాష్ట్రంలో కొన్ని రోజులుగా మళ్లీ వేగంగా విస్తరిస్తున్న కరోనా పిల్లలను కూడా వదలడం లేదు. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు నవజాత శిశువుల నుంచి 10 ఏళ్లలోపు 33 వేల మందికిపైగా పిల్లలకు కరోనా సోకింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో సుమారు నాలుగు శాతం. మరోవైపు 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసున్న కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో ఏడు శాతానికి పైగా ఉంది. కరోనా బాధితుల సంఖ్య ఓ వైపు పెరుగుతుండగా రికవరి రేటు కూడా గణనీయంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 72 శాతం దాటింది. ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు..

రాష్ట్రంలో కరోనా కేసులు తొమ్మిది లక్షలు దాటగా వీటిలో ఒక్క ముంబైలోనే 1.55 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యంత డేంజర్‌ జోన్‌గా ఉంది. అసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ధారావిలో కరోనా నియంత్రణకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం కాగా మరోవైపు ముంబైలో కూడా నిలకడగా కనబడింది. అయితే గత కొన్ని రోజులుగా ముంబైలో కరోనా కేసుల సంఖ్య 17 వేల నుంచి 19 వేలు దాటుతోంది. దీంతో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది

Tags :
|
|

Advertisement