Advertisement

  • టెన్నిస్ కు కరోనా సెగ ..విమర్శల సుడిగుండంలో దిగ్గజ ఆటగాడు జొకోవిచ్

టెన్నిస్ కు కరోనా సెగ ..విమర్శల సుడిగుండంలో దిగ్గజ ఆటగాడు జొకోవిచ్

By: Sankar Tue, 23 June 2020 10:19 AM

టెన్నిస్ కు కరోనా సెగ  ..విమర్శల సుడిగుండంలో దిగ్గజ ఆటగాడు జొకోవిచ్



టెన్నిస్ ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తోంది ..నిన్న మొన్నటి దాక ప్రశాంతంగా ఉన్న టెన్నిస్లో ఇపుడు వరుసగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..అయితే దీనంతటికి కారణం దిగ్గజ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ నిర్వహించిన టెన్నిస్ టోర్నీ ఏ అని తెలుస్తుంది ..ఈ టోర్నీలో ఆడేందుకు వచ్చిన ఆటగాళ్లలో దిమిత్రోవ్ ఇప్పటికే కరోనా బారిన పాడగా తాజాగ మరో ఆటగాడికి కూడా కరోనా సోకినట్లు తేలింది ..33వ ర్యాంకర్‌ బోర్నా కోరిచ్‌ పాజిటివ్‌గా తేలారు..దిమిత్రోవ్ , కోరిచ్ ఇద్దరు కలిసి సింగిల్స్ మ్యాచ్ల్లో తలపడ్డారు ఆ మ్యాచ్ తర్వాతనే జ్వరం లక్షణాలు ఉన్నాయి అని దిమిత్రోవ్ పరీక్షలు చేయించుకోగా అందులో కరోనా పాజిటివ్ అని తేలింది ..

నేను చికిత్స తీసుకుంటున్నా. ప్రస్తుతం కోలుకుంటున్నా. ముందుజాగ్రత్తలో భాగంగా నాతో కలిసి ఆడిన వారంతా టెస్టులు చేయించుకోండి. నాకు తెలియకుండా మీకు ఈ వైరస్‌ సోకితే నన్ను క్షమించండి’ అని బల్గేరియాకు చెందిన 29 ఏళ్ల దిమిత్రోవ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దిమిత్రోవ్‌తో సింగిల్స్‌ మ్యాచ్‌లో తలపడ్డ క్రొయేషియాకు చెందిన 23 ఏళ్ల బోర్నా కోరిచ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలాడు. ‘నాకు ఎలాంటి లక్షణాలూ లేవు. అయినా పరీక్షలో పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా’ అని కోరిచ్‌ సోషల్‌ మీడియాలో తెలిపాడు. దీంతో ఆదివారం కోరిచ్‌-జొకోవిచ్‌ మధ్య జరగాల్సిన ఆడ్రి యా టూర్‌ రెండో అంచె ఫైనల్‌ మ్యాచ్‌ రద్దయింది.


tennis,corona,positive,andria tour,djokovic,coric ,టెన్నిస్, కరోనా ,సెగ, విమర్శల ,సుడిగుండంలో, దిగ్గజ ఆటగాడు జొకోవిచ్



కాగా, ఇదే టోర్నీకి హాజరైన జొకోవిచ్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌ మార్కో పానిచితో పాటు దిమిత్రోవ్‌ కోచ్‌ క్రిస్టియాన్‌ గ్రో కూడా కరోనా పాజిటివ్‌గా తేలారని క్రొయేషియా మీడియా వెల్లడించింది. తమతో కలిసి ఆడిన ఆటగాళ్లకు కరోనా రావడంతో సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌లో ఆందోళన మొదలైంది. ‘ప్రస్తుతం జొకోవిచ్‌ బాగానే ఉన్నాడు. త్వరలోనే అతను పరీక్షలు చేయించుకుంటాడు’ అని నొవాక్‌ ఏజెంట్‌ తెలిపాడు. శుక్రవారం దిమిత్రోవ్‌-జొకోవిచ్‌ జోడీ డబుల్స్‌ మ్యాచ్‌ ఆడాడు.

ఆడ్రియా టూర్‌లో పోటీపడ్డ టాప్‌ ఆటగాళ్లకు కరోనా రావడంతో ఈవెంట్‌ నిర్వాహకుడైన నొవాక్‌ జొకోవిచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..ఈ టోర్నీని తిలకించేందుకు వచ్చిన సుమారు నాలుగువేలకు పైగా ప్రేక్షకుల్లో చాలావరకూ మాస్క్‌లు ధరించలేదు. అంతేకాదు.. మ్యాచ్‌లకు ముందు బాస్కెట్‌బాల్‌ ఆడిన జొకోవిచ్‌, దిమిత్రోవ్‌, సిలిచ్‌, కోరిచ్‌,జ్వెరెవ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా కౌగిలింతలు, షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకొని భౌతికదూరం నిబంధనలను గాలికొదిలేశారన్న వి మర్శలు వినిపిస్తున్నాయి. పైగా, ఆటగాళ్లంతా కలిసి రాత్రిపూట నైట్‌క్లబ్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయడం వివాదాస్పదమవుతోంది.

Tags :
|
|

Advertisement