Advertisement

  • ఈజీ మనీ కోసమే కిడ్నాప్... మిస్ కాల్ ఆదారంగా కిడ్నాపర్లు అరెస్టు...!

ఈజీ మనీ కోసమే కిడ్నాప్... మిస్ కాల్ ఆదారంగా కిడ్నాపర్లు అరెస్టు...!

By: Anji Mon, 16 Nov 2020 7:36 PM

ఈజీ మనీ కోసమే కిడ్నాప్... మిస్ కాల్ ఆదారంగా కిడ్నాపర్లు అరెస్టు...!

ఐదేళ్ల గౌతమ్‌ను తల్లి తండ్రులకు అప్పంగించారు సూర్యాపట జిల్లా ఎస్పీ భాస్కరన్. కిడ్నాప్ జరిగిన పరిణామాలను ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు. దీపావళి పండుగ రోజు బాలుడు గౌతమ్‌ను డబ్బుల కోసమే ‌ కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు.

ఈ నెల 13వ తేదీన రెక్కీ నిర్వహించిన నిందితులు.. స్థానిక లాడ్జిలో ఉన్నారని తెలిపారు. 14వ తేదీన బాబును కిడ్నాప్ చేశారు.

బాబును మొదట మిర్యాలగూడకు తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారని అన్నారు. ముగ్గురు కిడ్నాపర్లు గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన వారు అని తెలిపారు.

ఈజీ మనీ కోసమే కిడ్నాప్ జరిగినట్లుగా వెల్లడించారు. నిందితులంతా బాటసారుల ఫోన్‌ల సహాయంతో బాలుడి తండ్రికి ఫోన్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశారని… అయితే 7 లక్షలకు ఒప్పందం కుదిరిందని అన్నారు.

అయితే డబ్బుల కోసం మళ్లీ ఫోన్ చేశారని తెలిపారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. అయితే వారు చేసిన మిస్ కాల్ ఆదారంగా నిందితులను ట్రేస్ చేసినట్లుగా ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు. ఒక్కసారి వారి ఫోన్ నుంచి ఫోన్ చేయడంతో నిందితుల ఆచూకీ కనిపెట్టగలిగామని అన్నారు.

Tags :

Advertisement