Advertisement

  • ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు

By: chandrasekar Thu, 20 Aug 2020 12:57 PM

ఆంధ్రప్రదేశ్  ఉభయ గోదావరి జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు


బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. గోదావరికి వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో జిల్లా అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత, లంక గ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు. తీరం వెంబడి గంటకు 40 కి.మీ నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసారు.

ఆగస్టు 20వ తేదీ: ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

ఆగస్టు 21వ తేదీ: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు ప్రకటన విడుదల చేశారు.

Tags :
|

Advertisement