Advertisement

  • Breaking News; రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబు ఇప్పుడు పేలింది...!

Breaking News; రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబు ఇప్పుడు పేలింది...!

By: Anji Thu, 15 Oct 2020 2:15 PM

Breaking news; రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబు ఇప్పుడు పేలింది...!

రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబు తాజాగా పోలాండ్‌‌లో పేలింది. ఆ బాంబును ఏడాది కిందటే గుర్తించడం విశేషం. అయితే.. దాన్ని సురక్షిత పద్ధతుల్లో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుండగా చివరి నిమిషంలో పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలాండ్ అధికారులు తెలిపారు.

అయితే.. పరిసర ప్రాంతాల్లో కొన్ని కిలోమీటర్ల వరకు భూమి, ఇళ్లు కంపించినట్లు స్థానికులు తెలిపారు. ముందస్తు చర్యగా 2.5 కి.మీ. పరిధిలోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌కు చెందిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌.. నాజీ యుద్ధనౌకపై ఈ బాంబును జారవిసిరిందట. కానీ, అది పేలకుండా కింద పడిపోయింది. స్వినోవిస్యా ప్రాంతంలోని ఓడరేవు వద్ద భూమిలో 12 మీటర్ల లోతులో పాతుకుపోయిన ఈ బాంబును అధికారులు గతేడాది గుర్తించారు.

ఓడరేవులో పూడికతీత పనులు కొనసాగుతుండగా ఈ బాంబు బయటపడింది. ఐదు టన్నుల బరువు, 2.4 టన్నుల పేలుడు పదార్థాలు ఉన్న ఈ బాంబుకు ‘టాల్‌ బాయ్‌’ అని పేరు పెట్టారు.


మంగళవారం (అక్టోబర్ 13) ఈ బాంబును ‘బాల్టిక్‌ సీ’ సముద్రంలో ముంచి పేలుడు సంభవించకుండా నిర్వీర్యం చేసేందుకు పోలాండ్ నేవీ అధికారులు ప్రయత్నించారు. కానీ, ఆకస్మాత్తుగా పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌ చేపట్టడానికి ముందే స్థానిక ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి బాంబు నిర్వీర్యం చేసే ప్రాంతానికి 2.5 కి.మీ దూరంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాంబు పేలుడు ధాటికి కాలువలోని నీరు పెద్ద ఎత్తున ఎగసిపడింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


బాంబు నిర్వీర్యం చేసే ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో బ్రిడ్జి ఉండటంతో దానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పోలాండ్ దేశ నౌకాదళం తగిన జాగ్రత్తలు తీసుకుంది. డీఫ్లాగరేషన్‌ పద్ధతితో రిమెట్‌ కంట్రోల్‌ ద్వారా బాంబును నిర్వీర్యం చేయాలని భావించారు.


అయితే.. ఈ ప్రక్రియ చివరి దశలో ఆ బాంబు ఒక్కసారిగా పేలినట్లు అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు.

Tags :
|
|

Advertisement