Advertisement

  • దేవరగట్టులో మరొకసారి కర్రలదే విజయం ...27 మందికి గాయాలు

దేవరగట్టులో మరొకసారి కర్రలదే విజయం ...27 మందికి గాయాలు

By: Sankar Tue, 27 Oct 2020 12:28 PM

దేవరగట్టులో మరొకసారి కర్రలదే విజయం ...27 మందికి గాయాలు


కర్నూల్ జిల్లా దేవరగట్టులో మరోసారి కర్రలే పైచేయి సాధించాయ్‌. కరోనా నిబంధనలు పట్టించుకోకుండా ఏటా జరిగే బన్ని ఉత్సవం యథావిధిగా కొనసాగింది. ఉత్సవాలకు ఎవరూ రాకూడదని పోలీసులు పెట్టిన భారీ బందోబస్తు.. జనసందోహం ముందు తేలిపోయింది. అర్ధరాత్రి వేళ నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సుళువాయి, విరుపాకురం, ఎల్లార్తి గ్రామాల ప్రజలు గట్టుకు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు.

రాత్రి పదిన్నర వరకు ఖాళీగా ఉన్న తేరు బజారు ప్రాంతం ఒక్కసారిగా జనంతో కిక్కిరిసిపోయింది. ఆలయంలో అర్చకులు స్వామి కల్యాణోత్సవం నిర్వహించగా.. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తీసుకువచ్చి సింహాసన కట్ట వద్ద ఉంచారు. అక్కడి నుంచి భక్తులు విగ్రహాలకు కర్రలు అడ్డుగా ఉంచి రక్తపడి వద్దకు తీసుకువెళ్లారు. కర్రల సమరంలో 27 మందికి పైగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మొత్తమ్మీద.. కర్రల సమరాన్ని కరోనా వల్ల ఎలాగైనా నిషేధించాలనే జిల్లా యంత్రాంగం కృషి ప్రజల సెంటిమెంట్‌ ముందు ఫలించలేదు. ప్రజలెవరినీ గట్టుకు చేరనీయకుండా 30 చెక్‌పోస్టులు, 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, అర్ధరాత్రి కొండల మార్గం గుండా భక్తులు తరలివచ్చి బన్ని జైత్రయాత్రలో పాల్గొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పదిహేను వందల మందికిపైగా పోలీసులతో కలెక్టర్‌, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా.. వారి వ్యూహాలు ఫలించలేదు

Tags :

Advertisement