Advertisement

  • ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య..

ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య..

By: Sankar Thu, 16 July 2020 4:49 PM

ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య..



ఏపీ లో కరోనా కేసులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి ..గత వారం రోజులుగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..గురువారం బులిటెన్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 22,304 శాంపిల్స్ పరీక్షించగా మరో 2,584 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 9మందికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 2593కు చేరాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 38044కు చేరింది. గడచిన 24 గంటల్లో 40మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 492కి చేరింది. గత 24 గంటల్లో 943మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 19393 నమోదయ్యింది. మరో 18159మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

గత 24 గంటల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 590, తూర్పుగోదావరి జిల్లాలో 500, చిత్తూరు జిల్లాలో 205, పశ్చిమగోదావరి జిల్లాలో 195, అనంతపురం జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 139, కృష్ణా జిల్లాలో 132, కడప జిల్లాలో 126, నెల్లూరు జిల్లాలో 126, శ్రీకాకుళం జిల్లాలో 111, ప్రకాశం జిల్లాలో 104, విజయనగరం జిల్లాలో 101, విశాఖపట్నం జిల్లాలో 81 రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 4816పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 3987కు చేరాయి.. గుంటూరు జిల్లాలో 3963 కేసులు ఉన్నాయి.

Tags :
|
|
|
|

Advertisement