Advertisement

  • నంద్యాల కుటుంబం ఆత్మహత్య కేసులో 25 లక్షలు పరిహారం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

నంద్యాల కుటుంబం ఆత్మహత్య కేసులో 25 లక్షలు పరిహారం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

By: Sankar Thu, 12 Nov 2020 7:34 PM

నంద్యాల కుటుంబం ఆత్మహత్య కేసులో 25 లక్షలు పరిహారం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం


నంద్యాలలో ఆటో డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న​ ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు.

గురువారం సలామ్‌ అత్తగారిని కలిసిన ఎంపీ బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ కలెక్టర్‌ వీరపాండ్యన్‌, తహశీల్దార్‌ రవికూమార్‌ ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు. కాగా నంద్యాల మూలసాగరం ప్రాంతానికి చెందిన అబ్దుల్‌సలామ్‌ తన భార్య నూర్జహాన్‌ , కుమార్తె సల్మా , కుమారుడు దాదా ఖలంధర్‌ తో కలిసి ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్న కేసులో విచారణ నిమిత్తం పోలీసులు అబ్దుల్‌ సలామ్‌ను స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకున్న సలామ్‌.. కుటుంబంతో కలిసి గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు

Tags :
|
|

Advertisement