Advertisement

  • తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 2,478 కరోనా కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 2,478 కరోనా కేసులు

By: chandrasekar Fri, 04 Sept 2020 6:33 PM

తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 2,478 కరోనా కేసులు


సెప్టెంబర్ నుండి ఆన్ లాక్ సరళతరం చేయడం వల్ల తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి చాలా వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ గత 24 గంటల్లో గురువారం, సెప్టెంబరు 3న తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదు కాగా 10 మంది వైరస్‌తో మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,884కి పెరిగింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 866 మంది మరణించారు.

మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,024 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకోగా ప్రస్తుతం తెలంగాణలో 32,994 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,05,521 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 75శాతం ఉండగా మరణాల రేటు 0.63శాతంగా ఉంది. ఇదిలాఉంటే నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 267 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 190, రంగారెడ్డి జిల్లాలో 171 కేసులు నమోదయ్యాయి. అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు.

Tags :
|

Advertisement