Advertisement

  • తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,392 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,392 కరోనా కేసులు

By: chandrasekar Tue, 08 Sept 2020 7:41 PM

తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,392 కరోనా కేసులు


రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,163కు చేరాయి. తాజాగా వైరస్‌తో 11 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం తాజాగా వైరస్‌ నుంచి 2,346 మంది వైరస్‌ నుంచి కొలుకోగా, మొత్తం 1,12,587 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 24,579 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉండగా, దేశంలో 1.69గా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 77.5శాతంగా ఉందని పేర్కొంది. సోమవారం ఒకే రోజు 60,923 శాంపిల్స్‌ పరీక్షించగా ఇప్పటి వరకు 18,27,905 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 1,606 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 49,234 మందికి టెస్టులు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిదిలో 304 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 191, కరీంనగర్‌లో 157, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 132, ఖమ్మంలో 116, నల్గొండలో 105, నిజామాబాద్‌లో 102, సూర్యపేటలో 101, భద్రాద్రి కొత్తగూడెంలో 95, వరంగల్‌ అర్బన్‌లో 91 పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

Tags :
|
|

Advertisement