Advertisement

  • దేశంలో రికార్డు స్థాయిలో కరోనా.. లాక్ డౌన్ తర్వాత ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా.. లాక్ డౌన్ తర్వాత ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు

By: Sankar Sun, 05 July 2020 10:53 AM

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా.. లాక్ డౌన్ తర్వాత ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు



కరోనా మహమ్మారి దేశంలో తన తీవ్ర ఉదృతిని కొనసాగిస్తోంది ..రోజు రోజుకి అంతకు ముందు రోజు ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది ..లాక్ డౌన్ సమయంలో కరోనా ఎఫెక్ట్ అంతగా లేకపోయినప్పటికీ ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తివేయగానే కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి ..దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజలు ఎటువంటి భయం లేకుండా ఎప్పటిలానే రోడ్లపైన తిరగడం , సామజిక దూరం అన్న పదానికి ఆమడ దూరంలో ఉండటంతో కరోనా తన పని తాను చేసుకుపోతుంది .కరోనా కు వాక్సిన్ లేకపోవడం వలన స్వీయ నియంత్రణ తప్ప ఇంకో మార్గం కరోనా నివారణకు లేదు ..ప్రభుత్వాలు ఎన్ని సార్లు చెప్తున ప్రజలు అంతగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు ..

తాజాగా శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 22,771 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే 442 మంది బాధితులు కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 6,48,315కు, మరణాలు 18,655కు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 2,35,433 కాగా, 3,94,226 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. గత 24 గంటల్లో 14,335 మంది కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 60.81 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది.

భారత్‌లో జూన్‌ 1 నుంచి జూలై 4వ తేదీ దాకా 4,57,780 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.అయితే ఇపుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి కరోనాతో పాటు సీజనలు వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉంది ..దీనితో ఇక నుంచి ఇంకా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ..మరోవైపు కరోనా నిర్మునలకు వాక్సిన్ తయారీలో భారత్ కీలక ముందడుగు వేసింది ..భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన మందును క్లినికల్ ట్రయల్స్ కు పంపింది ..ఆగష్టు పదిహేను లోపు దేశంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి అవుతాయి ..

Tags :
|
|
|
|

Advertisement