Advertisement

  • ధోని కొట్టిన ఆ సిక్సర్ చరిత్రలో నిలిచిపోతుంది ..సౌరవ్ గంగూలీ

ధోని కొట్టిన ఆ సిక్సర్ చరిత్రలో నిలిచిపోతుంది ..సౌరవ్ గంగూలీ

By: Sankar Mon, 15 June 2020 12:18 PM

ధోని కొట్టిన ఆ సిక్సర్ చరిత్రలో నిలిచిపోతుంది ..సౌరవ్ గంగూలీ



టీమిండియా ఎప్పుడో 1983 లో క్రికెట్ లో ప్రపంచ కప్ సాధించింది ..కపిల్ దేవ్ సారధ్యం లో దిగ్గజ వెస్ట్ ఇండీస్ జట్టుపై సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది ..ఆ ఒక్క కప్ తో ఇండియాలో క్రికెట్ రూపు రేఖలే మారిపోయాయి ..ఆల్ టైం గ్రేట్ సచిన్ క్రికెట్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఆ కప్ ఏ అన్నాడంటే , అది ఇండియాలో ఎంత ప్రభావితం చేసిందో అర్థమవుతుంది ..ఆ తర్వాత టీమిండియా ఎన్ని సార్లు ప్రయతించిన 2011 వరకు మళ్ళీ కప్ను సాదించలేకపోయింది ..2003 లో ఫైనల్ దాకా వచ్చినప్పటికీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురిఅయింది .. అయితే 2011 లో మాత్రం ధోని కెప్టెన్సీ లో టీమిండియా మరొకసారి ప్రపంచ కప్ను ముద్దాడింది ..అయితే ఆ ఫైనల్లో ధోని కొట్టిన సిక్సర్ ఇప్పటికి అలాగే అభిమానుల మదిలో ఉంది.

అయితే ధోనీ కొట్టిన ఫినిషింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర విసిరిన బంతిని కళ్లుచెదిరే రీతిలో స్టాండ్స్‌లోకి తరలించిన ధోనీ.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కి మళ్లీ వరల్డ్‌కప్‌ని అందించాడు. ఆరోజు తనకి మరిచిపోలేని రోజని చెప్పుకొచ్చిన గంగూలీ.. కెప్టెన్‌గా తనకి సాధ్యంకానిది ధోనీ సాధించినందుకు సంతోషించినట్లు గుర్తు చేసుకున్నాడు.

2003 వరల్డ్‌కప్ ఫైనల్లో నా కెప్టెన్సీలోనే టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ.. కెప్టెన్‌గా ధోనీకి వరల్డ్‌కప్ గెలిచే అవకాశం రావడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఆరోజు నేను వాంఖడే స్టేడియంలోనే ఉన్నాను. మ్యాచ్ ఆఖర్లో ధోనీ, టీమిండియా సంబరాలను దగ్గర నుంచి చూసేందుకు కామెంట్రీ బాక్స్ నుంచి కిందకి వచ్చాను. నా వరకూ 2011 వన్డే ప్రపంచకప్‌ని భారత్ గెలవడం మరిచిపోలేని రోజు. ధోనీ కొట్టిన ఆ ఫినిషింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎంత గొప్ప క్షణాలవి..?’’ అని సౌరవ్ గంగూలీ గుర్తు చేసుకున్నాడు.


Tags :
|
|
|

Advertisement