Advertisement

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..తెలంగాణ పోలీస్ శాఖలో ఇరవైవేల ఖాళీలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..తెలంగాణ పోలీస్ శాఖలో ఇరవైవేల ఖాళీలు

By: Sankar Wed, 16 Dec 2020 1:31 PM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..తెలంగాణ పోలీస్ శాఖలో ఇరవైవేల ఖాళీలు


తెలంగాణాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీఎం కెసిఆర్ ఆదేశించడంతో అన్ని శాఖలలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో ఆ శాఖల అధికారులు వెల్లడిస్తున్నారు..తాజాగా పోలీస్ శాఖలో ఎస్సై , కానిస్టేబుల్ కలిపి మొత్తం ఇరవైవేల వరకు ఖాళీలు ఉన్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది..

ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 425 ఎస్సై పోస్టులు అవసరమని పేర్కొన్నారు. దీనిలో ఎస్సై సివిల్‌-368, ఏఆర్‌-29, కమ్యూనికేషన్స్‌-18 పోస్టులు ఉన్నాయి. 19,300 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీచేయాలని నివేదికలో తెలిపారు. వీటిలో సివిల్‌-7764, ఏఆర్‌-6683, టీఎస్‌ఎస్‌పీ-3874, కమ్యూనికేషన్స్‌-256, 15వ బెటాలియన్‌లో 561 ఖాళీలు ఇందులో ఉన్నాయి. ఇదిలాఉంటే.. వయోపరిమితి సడలింపుపై నోటిఫికేషన్‌ సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, మండలాలు, కొత్త కమిషనరేట్లు, డివిజన్లు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు ఏర్పడినందున వాటికి అనుగుణంగా పోలీసు సిబ్బంది నియామకాలు జరగాలి.ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్న ఈ 20వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Tags :
|
|

Advertisement