Advertisement

  • ఏలూరు లో పెరుగుతున్న అంతుచిక్కని అనారోగ్యం బాధితుల సంఖ్య

ఏలూరు లో పెరుగుతున్న అంతుచిక్కని అనారోగ్యం బాధితుల సంఖ్య

By: Sankar Sun, 06 Dec 2020 7:06 PM

ఏలూరు లో పెరుగుతున్న  అంతుచిక్కని అనారోగ్యం బాధితుల సంఖ్య


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో హటాత్తుగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన ఇప్పుడు కేవలం ఏలూరులోనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆందోళనకు కారణమయ్యింది.

ఈ ఘటనకు కారణాలు తెలియరావడం లేదు. అటు.. అస్వస్థతకు గురైన బాధిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అయితే.. ఎలాంటి వైరస్‌ లేదని నిర్ధారించారు. ఈ క్రమములో బాధితుల సంఖ్య 200 పైగా దాటింది. అంతుచిక్కని అనారోగ్యంతో ఇప్పటికి ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పోతున్నారు. ఏలూరు ప్రజలు కొద్దిరోజులు మున్సిపల్ నీళ్లు తాగవద్దని, వేడినీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నాని మాట్లాడుతూ.. చికిత్స అనంతరం అందరూ సాధారణ స్థితికి వస్తున్నారని తెలిపారు. నీటి నమూనా సేకరించిన రాష్ట్ర స్థాయి ల్యాబ్‌కు పంపాం. నీటిలో కాలుష్యం లేదని నివేదికలో తేలింది. బాధితుల రక్త నమునాలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. అందులోనూ ఎలాంటి వైరస్‌ కారణాలు లేవని తేలింది. మరికొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. వచ్చాక కారణాలు తెలుస్తాయి. ఈ పరిస్థితికి కారణాలను ఆన్వేషిస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారని మంత్రి నాని తెలిపారు.

కాగా ఏలూరు బాధితులను పరామర్శించేందుకు ఏపీ సీఎం జగన్ రేపు హుటాహుటిన ఏలూరు వెళ్లనున్నారు.. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కూడా రేపు ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు.

Tags :
|

Advertisement