Advertisement

  • తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..త్వరలోనే మరొక 20 వేల పోలీస్ ఉద్యోగాలు ...హోమ్ మంత్రి మొహమ్మద్ అలీ

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..త్వరలోనే మరొక 20 వేల పోలీస్ ఉద్యోగాలు ...హోమ్ మంత్రి మొహమ్మద్ అలీ

By: Sankar Fri, 23 Oct 2020 12:17 PM

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..త్వరలోనే మరొక 20 వేల పోలీస్ ఉద్యోగాలు ...హోమ్ మంత్రి మొహమ్మద్ అలీ


తెలంగాణ రాష్ర్ట పోలీసు అకాడ‌మీలో ఎస్ఐల పాసింగ్‌ అవుట్ పరేడ్ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు పోలీసు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

పోలీసు అకాడ‌మీలో 12వ బ్యాచ్‌కు చెందిన‌ 1,162 మంది ఎస్ఐలు శిక్ష‌ణ పూర్తి చేసుకున్నారు. శిక్ష‌ణ‌లో అత్యుత్త‌మ ప్ర‌తిభ చూపిన ఎస్ఐల‌కు హోంమంత్రి, డీజీపీ పుర‌స్కారాలు అంద‌జేశారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సివిల్‌కు చెందిన 661 ఎస్ఐలు, ఐటీ కమ్యూనికేషన్‌కు చెందిన 28 మంది ఎస్ఐలు, 448 మంది ఆర్ఎస్ఐలు, ఫింగర్ ప్రింట్‌కు చెందిన 25 ఏఎస్ఐలు ఉన్నారు. వీరిలో 256 మంది మహిళా ఎస్ఐలు ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ మాట్లాడుతూ. పోలీసు అకాడ‌మీ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 1,25,848 మందికి శిక్ష‌ణ ఇచ్చామ‌ని తెలిపారు. 18,428 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్ నియామ‌కాలు జ‌రిపామ‌ని చెప్పారు. శాంతి భ‌ద్ర‌తల ప‌రిరక్ష‌ణ‌కు ప్ర‌బుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు.

తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంద‌న్నారు. త్వ‌ర‌లోనే మ‌రో 20 వేల పోలీసు నియామ‌కాలు జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా, భారీ వ‌ర్షాల్లోనూ పోలీసులు అందించిన సేవ‌లు అమోఘ‌మ‌ని కొనియాడారు. పేద‌ల‌కు సేవ‌లు చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి మంచి పేరు తేవాల‌న్నారు. పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రికీ గౌర‌వం ఇవ్వాల‌న్నారు.

Tags :

Advertisement