Advertisement

  • నటీనటులు మరియు సాంకేతిక సిబ్బంది వేతనాల్లో 20 శాతం కోత

నటీనటులు మరియు సాంకేతిక సిబ్బంది వేతనాల్లో 20 శాతం కోత

By: chandrasekar Mon, 05 Oct 2020 09:42 AM

నటీనటులు మరియు సాంకేతిక సిబ్బంది వేతనాల్లో 20 శాతం కోత


కరోనా కారణంగా నటీనటులు మరియు సాంకేతిక సిబ్బంది వేతనాల్లో 20 శాతం కోత విధించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన షూటింగ్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మూతబడిన థియేటర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో తెరచుకోనున్నాయి. కాని 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడిపించాలని, థియేటర్లు శానిటైజ్ చేసి, కరోనా నిబందనలును ఉల్లంఘించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశించింది. కరోనావైరస్ సంక్షోభం కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో పడిందని, దాని నుండి కోలుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని భావించిన యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అక్టోబర్ 3న సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక సిబ్బంది అంగీకారంతో నటీనటుల వేతనాల నుండి 20 శాతం కోత విధించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా ప్రస్తుతం సినీ పరిశ్రమ పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నిర్మాతల ప్రతిపాదనను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా అంగీకరించింది. రోజుకు రూ. 20,000 లోపు వేతనం తీసుకునే నటీనటులకు ఈ కోత నుండి మినహాయింపు ఉంటుంది. ఒక సినిమాకి రూ. 5 లక్షలకు పైగా వేతనంగా డ్రా చేస్తున్న సాంకేతిక నిపుణులకు కూడా 20 శాతం కోత వర్తిస్తుంది. కరోనావైరస్ సంక్రమణకు ముందు నటీనటులు ఒప్పందం చేసుకున్న వేతానాలకు ఈ 20 శాతం కోత వర్తిస్తుంది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. లేక పోతే నిర్మాతలు నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Tags :
|

Advertisement