Advertisement

కాబుల్ యూనివర్సిటీలో మారణహోమం ...20 మంది మృతి

By: Sankar Mon, 02 Nov 2020 7:24 PM

కాబుల్ యూనివర్సిటీలో మారణహోమం ...20 మంది మృతి


అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో సాయుధులైన దుండగులు రక్తపాతం సృష్టించారు. కాబూల్ యూనివర్సిటీలో చొరబడి విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

సుమారు గంటపాటు సాగిన ఈ మారణహోమంలో 20 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు చేసిన బీభత్సం తర్వాత ఎటు చూసినా విషాదమే. కాబుల్ యూనివర్సిటీ గోడలపై రక్తపు మరకలు, చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఘటనా స్థలి భీతావహంగా మారింది.

విద్యార్థుల ఆర్తనాదాలతో విశ్వవిద్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. ప్రాణ భయంతో కొంత మంది విద్యార్థులు పారిపోతున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. యూనివర్సిటీ గోడలను దూకేసి విద్యార్థులు పారిపోయారు. అమాయకులైన విద్యార్థులు బలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాల్పుల్లో గాయపడ్డ విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags :
|

Advertisement