Advertisement

  • చైనాతో ఘర్షణల్లో భారత్‌కు చెందిన 20 మంది జవాన్ల మృతి

చైనాతో ఘర్షణల్లో భారత్‌కు చెందిన 20 మంది జవాన్ల మృతి

By: chandrasekar Wed, 17 June 2020 12:28 PM

చైనాతో ఘర్షణల్లో భారత్‌కు చెందిన  20 మంది జవాన్ల మృతి


చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో భారత్‌కు చెందిన జవాన్లు పెద్ద సంఖ్యలో అమరులైనట్లు తెలుస్తోంది. కనీసం 20 మంది సైనికులు వీర మరణం చెందినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ మంగళవారం జూన్ 16 రాత్రి ట్వీట్ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించింది.

భారత్, చైనా సరిహద్దుల్లో 5 వారాలుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్యాంగ్యాంగ్ త్సో, గాల్వాన్ లోయ, దేమ్‌చోక్, దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. మే నెల ప్రారంభం నుంచే చైనా వాస్తవాధీన రేఖ వెంట తన బలగాలను పెంచుతోంది. అక్కడికి అదనపు బలగాలను తరలించింది. భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులు మోహరించింది. సరిహద్దు వెంట పలు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. డ్రాగన్ ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

చైనా సైన్యం వైపు ఎంతమంది సైనికులు చనిపోయారని కానీ గాయపడ్డారని కానీ స్పష్టమైన సమాచారం ఏదీ లేదు. భారత సైన్యం సరిహద్దు దాటి వచ్చిందని చైనా సైనికుల మీద దాడి చేసిందని చైనా ఆరోపించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ చెప్పింది. భారత సైన్యం ప్రధాన కార్యాలయం జారీచేసిన ప్రకటన ప్రకారం ఇరు దేశాల సైన్యాలకు చెందిన సీనియర్ అధికారులు ఘర్షణ జరిగిన ప్రాంతంలో సమావేశమై సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నారు.

Tags :
|
|

Advertisement