Advertisement

  • 1983 ప్రపంచకప్ తన జీవితంలో మైలురాయి... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్

1983 ప్రపంచకప్ తన జీవితంలో మైలురాయి... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్

By: chandrasekar Fri, 26 June 2020 1:44 PM

1983 ప్రపంచకప్ తన జీవితంలో మైలురాయి... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్


కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 లో జరిగిన ప్రపంచకప్ ను ఇండియా గెలుచుకున్న సంగతి అందరికి తెలిసిందే. దీని గురించి సచిన్ టెండూల్కర్ మాట్లాడారు.1983 ప్రపంచకప్ తన జీవితంలో మైలురాయి లాంటిదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు ఆ విశ్వటోర్నీ టైటిల్ ను గెలిచినప్పుడు చేసుకున్న సంబరాలను అతడు గుర్తు చేసుకున్నాడు.

స్నేహితులతో కలిసి ఆ మ్యాచ్ ను చూశానని, వెస్టిండీస్ వికెట్ పడిన ప్రతీసారి గంతులు వేశామని మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు. కపిల్ డెవిల్స్ తొలిసారి భారత్ కు ప్రపంచకప్ ను సాధించిపెట్టి గురువారానికి 37ఏండ్లు పూర్తయ్యాయి.

1983 ప్రపంచకప్ ఫైనల్ నా జీవితంలో మైలురాయి లాంటిది. సిద్ధు అద్భుతమైన బంతికి గ్రీనిడ్జ్ షాట్ కొట్టగా.. కపిల్ పాజీ క్యాచ్ పట్టినప్పటి నుంచి అన్ని వికెట్లకు సంబురాలు చేసుకున్నాం. విండీస్ వికెట్ పడిన ప్రతిసారి నేను, నా స్మేహితులం గంతులు వేశాం. అది ఎంతో అద్వితీయమైన సాయంత్రం” అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.

Tags :
|

Advertisement