Advertisement

  • తెలంగాణాలో శుక్రవారం రికార్డు కరోనా కేసులు ..రెండు వేలకు చేరువలో ఒక్కరోజు కరోనా కేసులు

తెలంగాణాలో శుక్రవారం రికార్డు కరోనా కేసులు ..రెండు వేలకు చేరువలో ఒక్కరోజు కరోనా కేసులు

By: Sankar Sat, 04 July 2020 1:09 PM

తెలంగాణాలో శుక్రవారం రికార్డు కరోనా కేసులు ..రెండు వేలకు చేరువలో ఒక్కరోజు కరోనా కేసులు



తెలంగాణాలో కరోనా కేసులు రోజుకొక రికార్డు నమోదు చేస్తున్నాయి .. మొన్నటి వరకు ఒక్క రోజు కరోనా కేసుల్లో వెయ్యికి అటు ఇటుగా ఉన్న తెలంగాణలో నిన్న రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి ..ఒక్క రోజే 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..శుక్రవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1658 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్ జిల్లాలో 44, వరంగల్ రూరల్ జిల్లాలో 41, సంగారెడ్డి జిల్లాలో 20, మహబూబ్‌నగర్ జిల్లాలో 12 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.

కొత్తగా నమోదై కేసుల్లో నల్గొండలో 13, మహబూబాబాద్ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6, కామారెడ్డిలో 6, వనపర్తిలో 5, భద్రాద్రి కొత్తగూడెంలో 4, సిద్దిపేటలో 3, మెదక్‌లో 3, నిజామాబాద్‌లో 3, ఖమ్మంలో 2, నిర్మల్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, ములుగు, జగిత్యాల, వరంగల్ అర్బన్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 9,984 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగా 5,965 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,04,118 మందికి పరీక్షలు నిర్వహించారు.కరోనా నుంచి కోలుకొని శుక్రవారం పెద్ద సంఖ్యలో డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1126 మంది డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10,195కు చేరింది.

Tags :
|
|
|

Advertisement