Advertisement

  • తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తేలిపినట్లు మంగళవారం 1,712 మంది డిశ్చార్జి

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తేలిపినట్లు మంగళవారం 1,712 మంది డిశ్చార్జి

By: chandrasekar Wed, 01 July 2020 7:20 PM

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తేలిపినట్లు మంగళవారం 1,712 మంది డిశ్చార్జి


తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం కూడా భారీగా కొత్త కేసులు బయటపడ్డాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 945 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ 1,712 మంది డిశ్చార్జి కాగా మరో ఏడుగురు మరణించారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 869 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డిలో 29, సంగారెడ్డిలో 21, మేడ్చల్‌లో 13, నిర్మల్‌లో 4, కరీంనగర్, మహబూబ్ నగర్‌లో 2 చొప్పున, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున వచ్చాయి.

తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7,294 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవ్వగా 260 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,785 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో 3,457 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,512 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 945 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 88,563 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

Tags :

Advertisement