Advertisement

  • జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం ఏపీ పోలీసులపై 1,681 కేసులు

జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం ఏపీ పోలీసులపై 1,681 కేసులు

By: chandrasekar Sat, 03 Oct 2020 6:46 PM

జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం ఏపీ పోలీసులపై 1,681 కేసులు


జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం ఏపీ పోలీసులపై అత్యధికంగా 1,681 కేసులు ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుతెన్నులపై విస్మయపరిచే లెక్కలను జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పోలీస్‌లపై గత ఏడాది పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి.

భారత దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసులపై నమోదైన కేసులన్నీ కలిపితే 4,068. ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 1,681 కేసులు ఉన్నట్లు నివేదిక బయటపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్రలో పోలీసులపై 403 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై నమోదైన 1,681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎన్‌సీఆర్‌బీకి పోలీసుశాఖ వివరాలు తెలిపింది. మిగిలిన రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాక తక్కువగా ఉన్నట్లు గణాంకాలు తెలిపింది.

Tags :

Advertisement